Chhaava Collections: రూ.500 కోట్ల చేరువలో చావా

5
- Advertisement -

విక్కీ కౌశల్ నటించిన చావా ఫిబ్రవరి 14న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. 11వ రోజు ₹18.50 కోట్లు రాబట్టింది. 11 రోజులకు గాను “చావా” భారతదేశంలో ₹345.25 కోట్లు (నెట్) వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా “చావా” ఇప్పటి వరకు ₹444.50 కోట్లు వసూలు చేసింది.

చారిత్రక కథాంశం ఆధారంగా రూపొందిన చిత్రంలో విక్కీ కౌశల్, అక్షయే ఖన్నా, రష్మిక మందన్నా, అశుతోష్ రాణా, వినీత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు.లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విక్కీ కౌశల్ కెరీర్‌లో ₹300 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమాగా నిలిచింది.ఇదివరకు రష్మిక మందన్నా “అనిమల్”, “పుష్ప 2” సినిమాలతో ఈ క్లబ్‌లోకి ప్రవేశించింది.

“చావా” రోజు వారీ బాక్సాఫీస్ కలెక్షన్లు పరిశీలిస్తే..

డే 1: ₹31 కోట్లు
డే 2: ₹37 కోట్లు
డే 3: ₹48.5 కోట్లు
డే 4: ₹24 కోట్లు
డే 5: ₹24.5 కోట్లు
డే 6: ₹32 కోట్లు
డే 7: ₹21.5 కోట్లు
డే 8: ₹23.5 కోట్లు
డే 9: ₹44 కోట్లు
డే10: ₹40 కోట్లు
డే 11: ₹18.50 కోట్లు

ఈ చిత్రం రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన “బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 – శివ” (₹431 కోట్లు) లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను అధిగమించింది.

Also Read:టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..

- Advertisement -