తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావు ,జగదీష్ రెడ్డి ల సమక్షం లో బీ ఆర్ ఎస్ గూటికి చేరారు చెరుకు సుధాకర్. ఇదే సందర్భంలో నకిరేకల్, ఆలేరు నియోజక వర్గం నుండి ప్రముఖ నేతలు, కార్యకర్తల చేరిక. గులాబి కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు మంత్రులు.
మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి ఇవ్వాలంటే పది సార్లు ఆలోచిస్తాం..ఇంత గొప్పగా సాధించుకున్న రాష్ట్రం, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రం ఎవరు చేతిలో ఉండాలో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చెందిందన్నారు. 46 రోజుల పాటు కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్ సహా, జిట్టా బాలకృష్ణ, ఏపురు సోమన్న, హర్ దీప్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చేరడం గొప్ప విషయం, సంతోషం అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నాం అన్నారు.
ఉద్యమంలో మొదటిగా జైలుకు వెళ్లిన చెరుకు సుధాకర్ గారు, నేడు పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది. ఆయన కరుడుగట్టిన ఉద్యమ వాది అన్నారు మంత్రి హరీష్ రావు. అలాగే నకిరేకల్, ఆలేరు నియోజక వర్గం నుండి పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం తెలిపారు. మూడోసారి సీఎం గా కేసిఆర్ ఉండాలని మీరంతా పార్టీలోకి వస్తున్నారు…ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఒకవైపు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయని కిషన్ రెడ్డి మరో వైపు అన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశారు. సాధించారు..బిజెపి తో పోరాటం మా డి ఎన్ ఏ లో ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు. మరి రేవంత్ రెడ్డి డి ఎన్ ఏ లో ఏముంది మరి? అన్నారు. రేవంత్ డి ఎన్ ఏ లో ఎబీవీపి ఉందా, బిజెపి ఉందా, బి ఆర్ ఎస్ ఉందా, టిడిపి ఉందా, కాంగ్రెస్ ఉందా? ఆలోచించాలన్నారు.
Also Read:‘జోరుగా హుషారుగా’.. టీజర్