టీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి..

594
Cheruku Muthyam Reddy to join TRS
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగసభలో కారెక్కనున్నారు. మంత్రి హరీష్‌,మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముత్యం రెడ్డి ..దుబ్బాక సీటును టీజేఎస్‌కు కేటాయించడం అన్యాయమన్నారు. తొమ్మిదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవచేసినా గుర్తింపు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌తో తనకు పదేండ్ల ఆత్మీయ అనుబంధం ఉన్నదని, ఎప్పుడు కలిసినా ముత్తన్న అని అత్మీయంగా పలుకరిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌లో పైసలున్నోళ్లకే టికెట్లు ఇచ్చారని పార్టీ కోసం కష్టించి పనిచేసినా గుర్తింపు ఇవ్వలేదన్నారు. నాలుగేండ్లుగా కనిపించని దుబ్బాక కాంగ్రెస్ నాయకులు నేడు సేవ ముసుగులో కనిపిస్తున్నారని, ఇన్ని రోజులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. తనకు టికెట్ రాకుండా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కన్నీళ్ల పర్యంతమైన ముత్యంరెడ్డిని మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఓదార్చారు.

  cheruku muthyam reddy harish rao

1989, 1994, 1999లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్నారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగిన జర్నలిస్ట్‌ సోలిపేట రామలింగారెడ్డి ముత్యంరెడ్డిపై గెలుపొందారు. అనంతరం 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గం నుంచి
కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకు ముత్యంరెడ్డి గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి ఘనవిజయం సాధించారు.

- Advertisement -