వినాయక్‌కి మెగా గిఫ్ట్..!

203
Cherry to present costly gift to Vinayak!
- Advertisement -

టాలీవుడ్‌లో నయా ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకు ఒక ఫ్యామిలీకి చెందిన  హీరో సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వాలిపోయేవారు. కానీ తాజాగా ఆ ట్రెండ్‌ని చెరిపేస్తూ ఒక ఫ్యామిలీకి చెందిన హీరో సినిమా ఫంక్షన్స్‌లో ఇతర హీరోల హాజరవడం,సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫ్యాషన్‌గా మారింది. ఇక సినిమా హిట్టైందంటే చాలు దర్శకులను సర్ ప్రైజ్‌ గిఫ్ట్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు హీరోలు.

ఇప్పుడు అదే జాబితాలో చేరిపోయాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇటీవలే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడమే కాకుండా, 100 కోట్లకి పైగా వసూలు చేసింది.  ఈ సినిమా విజయంలో దర్శకుడిగా వినాయక్ ప్రధానమైన పాత్రను పోషించాడు.దీంతో వినాయక్‌కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు చెర్రీ. అయితే  ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడనే విషయం బయటికి రాలేదుగానీ… సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోన్న వార్తల ప్రకారం భారీగానే గిఫ్ట్ ప్లాప్ చేసాడట రాంచరణ్.

ఒకప్పుడు రైటర్‌గా ఉన్న కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారి శ్రీమంతుడు చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా మారారు.  మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం ఇటు మహేష్, అటు కొరటాలకు మంచి పేరు తీసుకు రాగా, టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డులు సాధించింది. ఇంతటి భారీ విజయాన్ని తనకు అందించినందుకు మహేష్ , కొరటాలకు 50 లక్షల విలువైన ఆడి ఎ6 కారును గిఫ్ట్‌గా అందించారు. తర్వాత జూనియర్ కూడా మహేష్‌నే ఫాలోఅయ్యాడు.

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్ చిత్రం జూనియర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఆనందంలో ఎన్టీఆర్ 20 లక్షల బ్రాండెడ్ వాచ్‌ని కొరటాలకు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -