రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా క్యాతన్ పల్లి ( రామకృష్ణపూర్) మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలను నాటారు చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కె బాపు.
ఈ సందర్భంగా కె బాపు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మొక్కలు నాటడం చాలా అవసరం. ఇప్పుడు మనం పర్యావరణాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కష్టమవుతుందన్నారు. పర్యావరణ రక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం.
ఇందులో నన్ను భాగస్వామి అయ్యేలా చేసిన వెంకట్ నారాయణకి మరియు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ధన్యావాదాలు తెలుపుతున్నాను అన్నారు. అంతేకాకుండా మరో ముగ్గురు మూడు మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు.