పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామిపై మండిపడ్డారు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. వివేక్ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు సుమన్. ఇవాళ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుండి వచ్చినా.. వివేక్‌కు కేసీఆర్ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే వివేక్‌ను ఎంపీ టికెట్ దక్కలేదన్నారు.
దళితుల కోసం వివేక్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం పెట్టే స్థలంలో వెంకటస్వామి విగ్రహాన్ని పెట్టించారన్నారు. వెంకటస్వామి జయంతిని అధికారికంగా ప్రకటించారు’ అని అన్నారు సుమన్. వివేక్ దళితుడు కాదని ధనవంతుడని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు స్థాపించిన వివేక్… పెద్దపల్లిలో ఎన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పారో చెప్పాలన్నారు సుమన్.