నాలుగోసారి…ఐపీఎల్ విజేతగా చెన్నై

256
csk
- Advertisement -

ఐపీఎల్‌ 14వ సీజన్ విజేతగా నిలిచింది ధోని సారథ్యంలోని సీఎస్కే. 14వ సీజన్ కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ఫేవరేట్ తామేనని నిరూపించింది.

193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌(51), వెంకటేశ్‌ అయ్యర్‌(50) మంచి ఆరంభాన్ని అందించారు. కానీ శార్దూల్‌ ఠాకూర్‌ మాయాజాలం, జడేజా అద్భుత ఫీల్డింగ్‌ ముందు కోల్ కతాకు పరాభవం తప్పలేదు. నితీశ్‌ రాణా(0), సునిల్‌ నరైన్‌(2), కెప్టెన్‌ మోర్గాన్‌(4), దినేశ్‌ కార్తిక్‌(9), షకీబ్‌ అల్‌ హసన్‌(0), రాహుల్‌ త్రిపాఠి(2), లాకీ ఫెర్గూసన్‌(3) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో చెన్నై విజయం సాధించింది.

అంతకముందు బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(27 బంతుల్లో 32 పరుగులు, 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), ఫాఫ్‌ డుప్లెసిస్‌(59 బంతుల్లో 86, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్బ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో రాబిన్‌ ఊతప్ప 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేయగా మొయిన్‌ అలీ సైతం 37 పరుగులతో రాణించడంతో చెన్నై 3 వికెట్లు కోల్పోయి… 192 పరుగులు చేసింది. అద్బుత బ్యాటింగ్ ప్రతిభ కనబర్చిన డుప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -