ఎట్టకేలకు ఐపీఎల్లో బోణి కొట్టింది చెన్నై. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. చెన్నై విధించిన 214 పరుగుల లక్ష్యచేదనలో ఆర్సీబీ 9 వికెట్లు కొల్పోయి 193 పరుగులు చేసింది. డుప్లెసీ (8), కోహ్లీ (1), రావత్ (12), మ్యాక్స్‌వెల్ (26) నిరాశపర్చగా షాబాజ్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 41), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34), సుయాశ్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) మాత్రమే పోరాడారు. తీక్షణకు నాలుగు, జడేజాకు మూడు వికెట్లు దక్కాయి.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై… 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 216 పరుగులు చేసింది. శివమ్ దూబే శివాలెత్తి స్కోరు బోర్డును కదం తొక్కించగా.. ఊతప్ప ఊచకోతతో సహాయపడ్డాడు. శివమ్ దూబే (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 నాటౌట్), రాబిన్ ఊతప్ప (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88) మెరుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శివమ్ దూబే నిలిచాడు. దూబే-ఊతప్ప జోరుకు ఐపీఎల్‌లో చెన్నై తరఫున అత్యధిక సిక్సర్లు (17) నమోదయ్యాయి