వెండి కొంగుతో పట్టుచీర..

612
chenetha
- Advertisement -

స్వరాష్ట్రంలో లో చేనేత వెలిగి పోతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో నేత కార్మికులు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ వెండి కొంగుతో పట్టుచీరను తయారుచేశాడు 170 గ్రాముల వెండి ని ఉపయోగించి 70 సెంటీమీటర్ల కొంగు 5.4 మీటర్ల పొడవుతో నేసిన ఈ చీరను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఆవిష్కరించనున్నారు.

సిరిసిల్ల నేతన్నలు తమ ప్రతిభతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు ఇప్పటికే అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో సిరిసిల్లకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కగా తాజాగా స్థానిక నేత కార్మికుడు నల్ల విజయ్ వెండి కొంగుతో పట్టు చీర ని తయారు చేశాడు మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు నల్ల విజయ్ వినూత్న ఆవిష్కరణకు కృషి ఇ చేస్తున్నానని ఇందులో భాగంగా కంచి లో తయారుచేసే వెండి కొంగు చీరను రెండు రోజుల పాటు శ్రమించి మ్యానువల్ జూ కార్డ్ యంత్రంతో మర మగ్గం పై స్థానికంగా అనే తయారు చేశాడు ఈ చీర అ 5.4 మీటర్ ల పొడవు 90 సెంటీమీటర్ల బ్లౌజు 70 సెంటీమీటర్ల కొంగు ఉంటుందని కొంగు తయారీకి కి 170 గ్రాముల వెండి ని వినియోగించని దీనికిగాను 25,000వేల వరకు ఖర్చు చేసినట్టు విజయ తెలిపారు.

కంచి లో తయారు చేసే చీరలు సిరిసిల్లలో తయారుకావాలి నాదే నా లక్ష్యం అని త్వరలోనే పూర్తి వెండి చీరలు తయారు చెయ్యాలని ఉన్నది అని అని ఎవరైనా సహకారం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని విజయ్ తెలిపారు

- Advertisement -