Congress:కాంగ్రెస్ కు బై బై.. నేతల వలసలు!

74
- Advertisement -

టీ కాంగ్రెస్ లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మొదటి జాబితా మరియు రెండో జాబితా అభ్యర్థుల ప్రకటన తరువాత ఆ పార్టీలో అసంతృప్త నినాదాలు తార స్థాయికి చేరుతున్నాయి. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు చాలమంది నేతలు. ప్రస్తుతం 100 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు సీట్లు ఆశించిన చాలమంది ఆశావాహులకు నిరాశే ఎదురైంది. దాంతో అసంతృప్త వాదులంతా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు సీటు బిజెపి నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి దక్కడంతో మొదటి నుంచి సీటు ఆశించిన చలమల కృష్ణారెడ్డి పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

ఇంకా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, దండెమ్ రాంరెడ్డి, నరసింహారెడ్డి, చాలామందే వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు. దాంతో వీరంతా కూడా హస్తం పార్టీకి షాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నర్సాపూర్ టికెట్ ఆశించిన అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ కు బై బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఇకపోతే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్నెట నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.

పార్టీలో ఎన్నో ఏళ్లుగా సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చారాయన. అలాంటి నేత పార్టీఫై తీవ్ర అసహనం చూపి కాంగ్రెస్ విడారు. త్వరలో ఆయన అధికార బి‌ఆర్‌ఎస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలమంది నేతలు కాంగ్రెస్ విడడానికి ప్రధాన కారణం.. పార్టీలో రేవంత్ రెడ్డి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సీట్ల కేటాయింపులో తనకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సీట్ల కేటాయింపు జరుపుతున్నారని.. గత కొన్నాళ్లుగా పార్టీలో కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక కారణమైతే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమ ప్రయత్నాలు చేసిన గెలిచే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్ విడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి ఈ వలసలను కాంగ్రెస్ అధిగమిస్తుందో లేదో చూడాలి.

Also Read:శారదా పీఠంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

- Advertisement -