చీతాల వేట మొదలైంది..

193
- Advertisement -

1952లో చీతాల జాతి అంతరించిపోయినట్టుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా తాజాగా సెప్టెంబర్‌17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను చిన్న ఎన్‌క్లోజర్‌లోకి ప్రధాని మోదీ స్వయంగా విడుదలచేశారు. దీంతో చీతాలు తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేశాయి. గత ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున మచ్చల జింకను రెండు చీతాలు వేటాడినట్లు కునో నేషనల్‌ పార్క్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. చిన్న ఎన్‌క్లోజర్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి విడుదల అయిన 24గంటలలోనే వేటను మొదలుపెట్టాయని అధికారులు తెలిపారు.

8చీతాలను నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌ తీసుకొచ్చారు. వీటిని దాదాపుగా 50 రోజులపాటు క్వారంటైన్ చేశారు. పెద్ద ఎన్‌క్లోజర్‌ ను శాటిలైట్‌ కాలర్స్‌ ఎన్‌క్లోజర్‌లోని కెమెరాలతో వీటి కదలికలను గమనిస్తున్నారు. మిగిలిన ఐదు చీతాలను కూడా త్వరలోనే పెద్ద ఎన్‌క్లోజర్‌లోని పంపే అవకాశలున్నాయి.

దేశంలోకి 75 యేళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8చీతాలు భారత్‌లోకి తీసుకొచ్చారు.

నమీబియా నుంచి తరలించేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విమానం బీ747 జంబోజెట్‌ను వినియోగించారు. అయిదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కునో పార్క్‌లోకి విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి..

పునీత్‌ కలల ప్రాజెక్ట్‌..

దక్షిణాదికి తొలి వందేభారత్‌ ట్రైన్

మిస్టర్‌360…మన సూర్య భాయ్‌

- Advertisement -