డిసెంబర్‌లో చీమ- ప్రేమ మధ్యలో భామ!

448
Cheema Prema Madhyalo Bhaama
- Advertisement -

మాగ్నమ్ ఓపస్ పతాకంపై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వంలో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం చీమ – ప్రేమ మధ్యలో భామ!” . ఇటీవల ఎస్‌పీ బాలసుబ్రమణ్యం పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “చీమ – ప్రేమ మధ్యలో భామ!” డిసెంబర్‌లో విడుదల అవుతుంది. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రం. అలాగని ఇది పూర్తి ఏనిమేషన్ చిత్రం కాదు. మంచి కుటుంబ కథా చిత్రం. అందరూ చూడదగ్గ చిత్రం” అని తెలిపారు.

Cheema Prema Madhyalo Bhaama

సినీ దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ “మా చిత్రం యొక్క ట్రైలర్ విడుదలయింది. ఎవరో రాజమౌళి ఈగను మా మాగ్నమ్ ఓపస్ చీమతో పోల్చారు, అది గొప్ప ప్రశంశ!. రాజమౌళి ఈగ రివెంజ్ స్టోరీ, మాది లవ్ స్టొరీ. నూతన నటులు అమిత్, ఇందు లను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాము. డిసెంబర్‌లో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

నటీ నటులు :అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.. సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్, కోరియోగ్రఫీ : చిరంజీవి, సుభాష్, ఆనంద్.కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ.

- Advertisement -