సంక్రాంతికి వస్తున్న చెడ్డీ గ్యాంగ్‌..

383
Cheddi Gang Movie
- Advertisement -

రాజ్‌ ప్రొడక్షన్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కనగాల రమేష్‌ చౌదరి దర్శకత్తంలో విక్కి రాజ్‌ నిర్మిస్తున్న చిత్రం చెడ్డీ గ్యాంగ్‌. శ్రీనివాస రెడ్డి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో అమర్‌, ప్రదీప్‌ వర్మ, ఉదయ్‌, అభి, సి.టీ, ఖాదర్‌, లక్ష్మీ, శృతి, కావ్య, దేవీ, వీణ, జాస్మిన్‌, ప్రధాన తారాగణం. ఫస్ట్‌ కాపీ సిద్ధం చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెన్సార్‌ పూర్తి చేసుకోనుంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు రమేష్‌ చౌదరి మాట్లాడుతూ.. సినిమా కథ విసయానికొస్తే.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బాగా పని చేసే 10 మంది ఉద్యోగులను కంపెనీ ఎమ్‌.డీ కేరళ టూర్‌కు పంపిస్తాడు. కేరళ అడవుల్లో వాళ్లు హాయిగా ఎంజాయ్‌ చేస్తుంటారు. అడవుల్లో కోయవారి జాతరకు వెళ్లిన ఆ 10 మంది నిబంధనలను అతిక్రమించి అక్క ఇరుక్కుపోతారు. చివరికి అక్కడ నుండి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్రం. సస్పెస్ప్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది.

Cheddi Gang Movie

కేరళలోని ఎర్నాకుళం, ఇరిట్టి అడవులు, హైదరాబాద్‌లోని సారధీ స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీ, మలేషియాలో ఈ మూవీని తెరకెక్కించాం. మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాలో ఐదు పాటలుంటాయి. బాలీవుడ్‌ బ్యూటీ స్నేహా కపూర్‌ ఐటమ్‌ సాంగ్‌ యూత్‌ను ఉర్రూతలూగిస్తుంది. మూడు ఫైట్స్‌ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. 125 రోజుల పాటు రెండు షెడ్యూళ్లలో సినిమాను తెరకెక్కించాం. ఇక 32 సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌ డైరెక్ట్‌గా పనిచేసిన నేను దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం చెడ్డీ గ్యాంగ్‌.

త్వరలోనే ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. అని అన్నారు. సెంథిల్‌కుమార్‌, బాబు రాజన్‌, దేవన్‌, సరోజిత్‌, నేయాస్‌ బేకర్‌ రాజ్‌, రాధ వర్మ, లష, స్నేహా కపూర్‌, అంబు చంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్‌: ఎ. వెంకటేష్‌, సంగీతం: ప్రదీప్‌ వర్మ, ఆర్ట్‌ డైరెక్ట్‌ బాస్కర్‌, డ్యాన్స్‌ సతీష్‌ బోస్‌, చెంతామేరి, స్టంట్స్‌:థండర్‌ గుణ, నిర్మాత: విక్కిరాజ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: కనగాల రమేష్‌ చౌదరి.

- Advertisement -