సోంపు వాటర్‌…ఉపయోగాలు

9622
- Advertisement -

సోంపు గురించి మనందరికి తెలిసే ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా ఉండే సోంపు వంటకాలకు మంచి సువాసన అందించడంతో పాటు.. కూరల రుచిని కూడా పెంచుతుంది. కాబట్టి వివిద వంటకాలలో సోంపు వాడడం తప్పనిసరి. ఇక సోంపు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. అందుకే భోజనం చేసిన తరువాత సోంపు తినడం చాలా మందికి అలవాటు. అయితే సోంపు తినడం వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. సోంపులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణ సమస్యలపై ప్రభావవంతంగా పని చేస్తాయి. అజీర్తిని దూరం చేసి జీర్ణ శక్తిని పెంచుతాయి. .

అంతే కాకుండా ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. అందుకే భోజనం చేసిన తరువాత తప్పకుండా సోంపు తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక సోంపును ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వివిద సమస్యలకు సోంపును ఒక ఔషధంలా ఆయుర్వేద నిపుణులు ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా అధికబరువుతో బాధ పడే వాళ్ళు ప్రతిరోజూ సోంపు వాటర్ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్ అద్భుత కార్యక్రమం:ద్రౌపది ముర్ము

ఒక గ్లాస్ నీటిలో సోంపు వేసి బాగా వేడి చేసి ఆ తరువాత వడగట్టి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడూ ఆ వాటర్ తాగితే చక్కటి ఫలితాలు వస్తాయట. నీటిలో ఉండే మినరల్స్ అలాగే సోంపులో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మిళితమై శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదర సమస్యలు ఉన్నవారు లేదా అధిక బరువుతో బాధ పడే వాళ్ళు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ సోంపు వాటర్ తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: గ్రీన్ టీ ఎక్కువగా తాగితే.. ప్రమాదమా?

- Advertisement -