ఆనంద్‌ మహీంద్రాకు షాక్!

15
- Advertisement -

మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు షాక్‌ తగిలింది. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఓ వ్యక్తి మహీంద్రాపై చీటింగ్‌ కేసు పెట్టగా మహీంద్రాతో పాటు మరో 12 మందిపై కాన్పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

యూపీకి చెందిన రాకేశ్‌ మిశ్రా 2022లో మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియోను తన కుమారుడు అపూర్వ్‌కు కొనిచ్చాడు. దాని విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు. దీంతో 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్‌ తన స్నేహితులతో కలిసి కొత్తకారులో లక్నో నుంచి కాన్పూర్‌ బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన తర్వాత మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్‌ లేవని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:ఏ14గా లోకేశ్.. జైలు బాట తప్పదా?

- Advertisement -