చౌక ధరకే 5G ఫోన్స్‌…ఇవే!

444
5g phones
- Advertisement -

5G నెట్‌వర్క్‌ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. తొలుత ఎంపిక చేసిన పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా దీనిని క్యాష్ చేసుకునేందుకు మొబైల్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు 5జీ మొబైల్స్‌ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. అసలు 5జీ ఫోన్ ధరలు ఎలా ఉన్నాయి…తక్కువ బడ్జెట్‌లో వచ్చే మొబైల్స్ ఏంటో చూద్దాం…

Samsung Galaxy F13 5G..

Samsung Galaxy M13 6GB RAM, 128GB స్టోరేజీతో వచ్చే ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. HD+ రిజల్యూషన్, డ్యూయల్-సిమ్ సపోర్టుతో చిన్న 6.5-అంగుళాల డిస్‌ప్లేను కూడా పొందుతుంది. ఈ ఫోన్ అదే 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ధర రూ.14,990.

Moto G51 5G..

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పొడవైన 6.8-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద.. స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్‌తో వస్తుంది. వెబ్ బ్రౌజింగ్, సోషల్ మీడియా యాప్‌లలో చిన్న వీడియోలను సులభంగా చూడవచ్చు. ఇందులో 50-MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ కూడా ఉన్నాయి. దీని ధర రూ.14,999.

Redmi Note 10T 5G..

ఈ ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లే. 48-MP ప్రైమరీ కెమెరాతో వెలుతురులోనూ మంచి ఫోటోలను తీయవచ్చు. తక్కువ వెలుతురులో ఫొటోల క్వాలిటీ తగ్గుతుంది. దీని ధర రూ.14,999.

Poco M4 5G ..

ఇది 90Hz 6.58-అంగుళాల డిస్‌ప్లే, 50MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, 5,000mAh బ్యాటరీతో పాటు ఏడు 5G బ్యాండ్‌లకు సపోర్టు అందిస్తుంది.దీని ధర రూ. 12,999.

iQoo Z6 5G ..

ఇది 6.68-అంగుళాల డిస్ప్లేతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. దీని ధర రూ. 13,990.

ఇవి కూడా చదవండి..

- Advertisement -