వేలానికి చేగువేరా సొంత ఇల్లు

352
cheguvera
- Advertisement -

చేగువేరా ఈ పేరు వింటేనే యువతలో తెలియని ఉత్సాహం వస్తుంది. ద‌క్షిణ అమెరికా విప్ల‌వ‌కారుడు ఎర్నెస్టో చెగువేరా తనపోరాటంతో చరిత్రలో నిలిచిపోయారు. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి ఆయన చేసిన పోరాటం మరువలేనిది. 20వ శ‌తాబ్ధ‌పు వామ‌ప‌క్ష ఉద్య‌మ‌కారుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చేగువేరాకు గుర్తింపు ఉన్న‌ది. క్యూబా స్వాతంత్రపోరాటంలో చేగువేరా కీలక పాత్ర పోషించారు. క్యూబా దేశంలో పరిశ్రమల, కార్మికశాఖా మంత్రిగా పనిచేశారు. 39సంవత్సరాలకే చేగువేరా మరణించాడు.

కాగా అర్జెంటీనాలోని రోసారియో నగరంలో చేగువేరా జన్మించారు. అయితే చెగువేరా ఇంటిని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. 2002లో నిర్వహించిన వేలంపాటలో ఈ భవనాన్ని ఫ్రాన్సిస్ కో ఫరుగియా అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దీన్ని సాంస్కృతిక కేంద్రంగా చేయాలనుకున్నప్పటికీ కుదరకపోవడంతో… వేలం వేయాలని అనుకుంటున్నానని తెలిపాడు. చేగువేరా జన్మించిన బిల్డింగ్ ను పర్యాటక ప్రాంతంగా ఉంచారు. ఈ బిల్డింగ్ ను వీక్ఛించేందుకు విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. ఈబిల్డింగ్ వేలం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఈ ఇల్లును ఎవరు కొనుకుక్కుంటారో అని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

- Advertisement -