RX 100 సినిమాతో యూత్‌లో తనకంటూ తెచ్చుకున్న హీరో కార్తికేయ. తాజాగా కౌశిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్ఫణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో చావు కబురు చల్లగా అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా 90 ఎంఎల్‌తో మెప్పించలేకోపోయిన కార్తికేయ…ఈ సినిమాలతో ఎలా ఆకట్టుకున్నాడో చూద్దాం..
కథ:
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాలను మోసుకెళ్లే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సిటీలో ఎవరైనా చనిపోతే తన వాహనంలో స్మశానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో భర్తను కొల్పోయిన యువతి మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్తాడు. సీన్ కట్ చేస్తే టీవీలు రిపేరు చేసే మోహన్(శ్రీకాంత్ అయ్యంగార్)తో తన తల్లి గంగమ్మ చనువుగా ఉండటం బాధపడతాడు. తన తల్లికంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పది అని భావిస్తాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంది? భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడు? అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి, పాటలు,సెకండాఫ్. తన నటనతో సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లాడు కార్తీకేయ. చక్కని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్యత్రిపాఠి అద్భుతంగా నటించింది. గంగమ్మ పాత్రకు ప్రాణం పోసింది ఆమని. సినిమాలో కీ రోల్‌గా ఉన్న ఆమని కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగితా నటీనటుల్లో మురళీశర్మ , శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే,ఫస్టాఫ్,స్లోనేరేషన్. భర్తను కోల్పోయిన యువతని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా స్క్రీన్‌ప్లే మరింత బలంగా రాసుకుని ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. జోక్స్ బిజోయ్ సంగీతం బాగుంది. సినిమాలోని పాటలు అలరించడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు:
పుట్టిన ప్రతి మనిషి ఎదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి రోజు బాధపడాల్సిన అవసరంలేదు….చనిపోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడు మెప్పించాడనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ వీకెండ్లో చూడదగ్గ చిత్రం చావుకబురు చల్లగా.
విడుదల తేదీ: 19/03/2021
రేటింగ్: 2.5
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి
సంగీతం : జాక్స్ బిజోయ్
నిర్మాత : బన్నీవాసు
దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి