ఎవ‌రీ చారుల‌త..? నెటిజన్ల సెర్చ్‌..

488
kohli
- Advertisement -

టీమిండియా ఆడే మ్యాచ్‌లంటే క్రికెట్ ఫ్యాన్స్‌ చేసే ఫీట్స్‌ అంతా ఇంత కాదు. కెమెరాలతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఇక బర్మింగ్‌ హామ్‌ వేదికగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఓ వృద్ధురాలు ఇలాగే సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎంత‌గా అంటే గ్యాప్ వ‌చ్చిన ప్ర‌తీసారీ కెమెరామెన్ ఆ పెద్దావిడ‌ వైపే త‌న ఫోక‌స్ పెట్టేంత‌గా.

ఇంతకీ ఆమె అట్రాక్షన్‌గా మారడానికి గల కారణాలేంటనుకుంటున్నారా..?పొడుగు చేతుల స్వెట్ట‌ర్‌, మెడ‌లో స్కార్ఫ్‌లా ధ‌రించిన దుప‌ట్టా, చెంప‌ల‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పెయింట్ వేసుకోవడం. 87 సంవత్సరాల వయస్సులో మ్యాచ్ జరుగుతున్నంత సేపు సందడి చేశారు చారులత. భారత బ్యాట్స్‌మెన్లు షాట్ కొట్టిన ప్ర‌తీసారీ డుగాటి బూర‌ను ఊదుతూ చిన్న‌పిల్ల‌లా మారిపోయారు.

దీనికి తోడు మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ..చారులత దగ్గరికి చేరుకొని పరామర్శించడంతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది. రోహిత్‌తో పాటు కోహ్లీ మ్యాచ్ ముగిసిన అనంత‌రం నేరుగా చారుల‌తా పటేల్ వ‌ద్ద‌కు వెళ్లారు. భ‌క్తిభావంతో న‌మ‌స్క‌రించారు. చారుల‌త ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా చారుల‌త ఆప్యాయంగా కోహ్లీని ముద్దాడారు.

చారులతను కలిసిన ఫొటోలను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తమకు మద్దతు పలికిన ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.క్రికెట్‌పై చారులతకున్న అభిరుచి, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. వయసు అనేది ఒక నంబరు మాత్రమేనని, అభిరుచి హద్దులను చెరిపేస్తుందని కోహ్లీ పేర్కొన్నాడు.

- Advertisement -