పూరీ జగన్నాథ్ సినిమాలు ఎంత డిఫెరెంట్ గా ఉంటాయో..అందులో ఉండే ఐటెంసాంగ్స్ కూడా అంతే డిఫెరెంట్ గా ఉంటాయి. కేవలం ఐటెంసాంగ్ కోసమే కత్తిలాంటి ఫిగర్స్‌కి గాలం వేస్తాడు ఈ మాస్ డైరెక్టర్. పూరీ సినిమాలో ఐటెంసాంగ్ ఎలా ఉన్నా..ఐటెంగాళ్ మాత్రం అదిరిపోవాల్సిందే.
అందుకే ఐటెంగాళ్స్‌ని కేర్ గా చూసుకుంటుంటాడు పూరి. పూరీ సినిమాలో ఐటెంగాళ్ గా మారిన బ్యూటీస్ రేంజ్ మామూలుగా ఉండదు. ఫుల్ బిజీ అయిపోవాల్సిందే. ఇక హాట్ బ్యూటీ చార్మీని కూడా ఆయన సినిమాల్లో ఐటెంగాళ్ గా వాడేసుకున్నాడు పూరి.
అయితే ఛార్మీకి టైం బాగోలేకో, ఆఫర్లు రాకో, ఈ మధ్య ఫేడవుట్ అయింది ఛార్మీ. దాంతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్టార్ట్ చేసిన పూరీ కనెక్ట్స్ వ్యవహారాలు చూస్తోంది. అయితే ఛార్మీకి బ్రేక్ ఇవ్వడానికి పూరీ తెగ ప్రయత్నిస్తున్నాడట. బాలయ్యతో చేస్తోన్న మూవీలో ఛార్మీ చేత ఓ ఐటెం సాంగ్ చేయించబోతున్నాడట పూరీ జగన్నాథ్.
బాలయ్యతో చేస్తున్న మూవీలో భారీ లెవెల్లో ఐటెం సాంగ్ తెరకెక్కించబోతున్నాడట. అయితే పూరీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఎంత పాపులర్ అవుతాయో అందరికీ తెలిసిందే. పూరీ పరిచయం చేసిన ఐటెం గాళ్స్ కి కూడా డిమాండ్ ఎక్కువగానే వుంటుంది. మరి పూరీ ఐటెం సాంగ్ తో మళ్ళీ ఛార్మీకి ఛార్మ్ పెరుగుతుందో లేదో చూడాలి.
ఛార్మీని మళ్లీ లైమ్ లైట్ లో వెలిగించాలని పూరీ తహతహలాడుతున్నారని ఐటెం సాంగ్ బంపర్ హిట్ కావడం ఖాయమంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మరి ఆఫర్లు కావాలంటే..అప్పుడప్పుడు పూరి వైపు చూసే ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం పూరీనే నమ్ముకుంది. ఇప్పటికే చార్మికి బ్రేక్ ఇవ్వడానికి తెగ కష్టపడుతున్న పూరి.. ఐటెంసాంగ్ ని ఆఫర్ చేశాడు. చూడాలి మరి ఈ ఆఫర్ చార్మీకి ఎన్ని ఆఫర్లను తెచ్చిపెడుతుందో.