”రోగ్” సినిమా ట్రైలర్ లాంచ్ లో తళుక్కున మెరిసింది సీనియర్ హీరోయిన్ ఛార్మి. ఈ అమ్మడుకి పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఈ మధ్య కనిపించట్లేదనుకోండి..అది వేరే విషయం. ఇక ”రోగ్” సినిమా ట్రైలర్ లాంచ్ లో పెద్దగా ఫోటోలకు ఫోజులు కూడా ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. మరి అలా ఎందుకు ఫోజులివ్వలేదోగానీ.. రోగ్ సినిమా హీరోయిన్లను మాత్రమే క్లిక్ చేసుకోండి.. నన్ను తీయాల్సిన అవసరం లేదని చెప్పేసింది చార్మి.
అయితే ఇప్పుడు ఈ అమ్మడుకి కావాల్సినవి పూరిని అడుగుతోందట. ఇప్పుడు పూరి జగన్ క్యాంపులో ”పూరి కనక్ట్స్” కంపెనీను చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఇతర పాత్రలు కూడా కావాలని అంటోందట చార్మి. గతంలో పూరిజగన్నాథ్ తీసిన జ్యోతిలక్ష్మి సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది ఛార్మి… ఇప్పుడు పూరి తదుపరి తీయబోయే పెద్ద సినిమాల్లో కూడా ఏదో ఒక రోల్ లో పనిచేయడానికి సిద్దంగా ఉందట.
ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అనో.. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనో.. క్యాస్టింగ్ హెడ్ అనో.. ఇలా ఏదో ఒక రోల్ ఇవ్వండి పూరి సార్ అని చార్మి అనడంతో.. మనోడు కూడా చార్మికి త్వరలో నందమూరి బాలకృష్ణ హీరోగా తీయబోయే సినిమా మేకింగ్ లో ఒక కీలకపాత్రను అప్పజెప్పుద్దాం అనే ఫిక్సయ్యాడట. అంతేకాకుండా.. వీలైతే పూరి తదుపరి సినిమాల్లో.. కావాలంటే ఐటెం సాంగ్స్ వంటివి చేయడానికి కూడా ఛార్మి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హీరోయిన్ గా తన కెరియర్ ను క్లోజ్ చేసుకుని.. ఇలా తదుపరి పాత్రలను పోషించడానికి సిద్దపడిన ఛార్మికి పూరి అండగా ఉంటాడో లేదో చూడాలి.