కానిస్టేబుల్ తనపై చెయ్యి వేశాడన్న ఛార్మీ !

260
Charmee complains about constable Srinivas
Charmee complains about constable Srinivas
- Advertisement -

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి ఛార్మీని సిట్ ఇప్పటి వరకు జరిగిన విచారణలకు భిన్నంగా ఉంది. ఈ ఛార్మీని కేవలం లేడీ అధికారులు మాత్రమే విచారించాలి అని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సిట్ విచారణ ఎదుర్కొనేందుకు ఛార్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధం అయి సిట్ ఆఫీస్‌కు వచ్చింది. ఈ క్రమంలో మీడియా ఛార్మీని కెమెరాల్లో బంధించేందుక పోటీ పడగా.. పోలీసులు ఛార్మీని విచారణ గదిలోకి తీసుకెళ్లేందుకు శ్రమ పడాల్సి వచ్చింది.. అయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని, అతనిపై ఛార్మీ ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాను కార్యాలయానికి వచ్చిన సమయంలో కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రధాన ద్వారానికి అడ్డుగా నిల్చున్నారని, వారిని ఛేదించుకుంటూ రావడం కష్టమైందని ఆమె చెప్పింది. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన చేతులు పట్టుకుని లాగేందుకు కొందరు ప్రయత్నించారని, శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని ఆమె తెలిపింది. కాగా, ఆమెను విచారించేందుకు ఎక్సైజ్ మహిళా సూపరింటెండెంట్ తో పాటు ముగ్గురు మహిళా సీఐలను సిట్ ఎంపిక చేసింది. వీరు నలుగురూ ఛార్మీని విచారిస్తున్నారు. ఛార్మీ ఫిర్యాదుపై ఎక్సైజ్ అధికారులు స్పందించాల్సి ఉంది.

మరోవైపు ఛార్మీ పలు ప్రశ్నలకు తనకు తెలియదు.. అవును… కాదు.. ఈ విధంగా సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. కేసు విచారణ నుండి ఇప్పటికే తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఛార్మీ.. సిట్‌లో తనకు ఎదురయ్యే ప్రశ్నలకు పక్కాగా స్క్రిప్ట్‌ ప్రిపేర్ చేసుకొని వచ్చిందని సమాచారం.

సిట్ కార్యాలయం నుంచి లీక్ లు వస్తున్న లీకుల ప్రకారం ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి..
ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా?
సమాధానం: నేను డ్రగ్స్ తీసుకోను.
ప్రశ్న: మీరు పబ్ లకు వెళతారా?
సమాధానం: వెళ్తాను.
ప్రశ్న: పబ్స్ లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందా?
సమాధానం: ఆ విషయం నాకు తెలియదు.
ప్రశ్న: కాల్విన్ తో మీకు పరిచయం ఉందా?
సమాధానం: ఓ ఈవెంట్ లో పరిచయం అయ్యాడు.
ప్రశ్న: కాల్విన్ తో మీరు వెయ్యికి పైగా వాట్స్ యాప్ మెసేజ్ లను పంచుకున్నారు. దీనిపై మీరేమంటారు?
సమాధానం: (మౌనం)
ప్రశ్న: జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కాల్విన్ తో సెల్ఫీలు దిగారా?
సమాధానం: అందరితో దిగినట్టే, అతనితోనూ దిగాను.
ప్రశ్న: పూరీ జగన్నాథ్ మీకు స్నేహితుడేనా?
సమాధానం: అవును.
ప్రశ్న: పూరీ డ్రగ్స్ వాడతారా?
సమాధానం: వాడరు. ఆయన డ్రగ్స్ కు వ్యతిరేకి.
ప్రశ్న: మీకు ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: లేదు.
ప్రశ్న: పూరీకి ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: తెలియదు.
ప్రశ్న: పూరీ ఇంటర్నేషనల్ సిమ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి కదా?
సమాధానం: (మౌనం)
ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా?
సమాధానం: లేదు.
చార్మీ విచారణ కొనసాగుతోంది.

- Advertisement -