నాగ్‌ సెంటిమెంట్‌..అఖిల్‌ను కాపాడుతుందా?

210
akhil akkineni second movie release date fixed
- Advertisement -

కింగ్‌ నాగార్జున వార‌సుడు అఖిల్ రెండో సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. అఖిల్‌ తన ఫస్ట్‌ సినిమాతోనే అక్కినేని ఫ్యాన్స్‌కి నిరాశను మిగిల్చాడు. అందుకే తన రెండో సినిమాను ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ మూవీగా తన ఫ్యాన్స్‌ కి అందించాలని అఖిల్‌ తెగ ట్రై చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం అఖిల్ సినిమా మ‌నం ఫేమ్ విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి ఎన్నో వార్త‌లు వినిపించాయి. స్క్రిప్ట్ లో కొంత మార్పుల వ‌ల‌న ఈ సినిమా డిలే అవుతుంద‌ని, వ‌చ్చే ఏడాది మూవీ విడుద‌ల అయ్యే ఛాన్స్ ఉంద‌ని పుకార్లు వ‌చ్చాయి.

akhil akkineni second movie release date fixed

ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత, అఖిల్ తండ్రి నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్ క‌న్ ఫాం చేశాడు. డిసెంబ‌ర్ 22న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌రుగుతుండ‌గా, విక్ర‌మ్- వినోద్ మ‌రోసారి త‌మ మ్యూజిక్ తో అద‌ర‌గొట్ట‌నున్నార‌ని ట్వీట్ చేశాడు నాగ్. డిసెంబ‌ర్ అనేది నాగ్ ల‌క్కీ మంత్ కాగా, ఈ సారైన నాగ్ సెంటిమెంట్ అఖిల్ కి క‌లిసి వ‌స్తుందేమో చూడాలి.

రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ డైరక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక‌ సినిమాకి పలు టైటిల్స్ పరిశీలించిన చిత్ర యూనిట్ ఫైనల్ గా హలో గురు ప్రేమ కోసమే అనే టైటిల్ ని పెట్టాలని భావిస్తుందట. మొత్తానికి అఖిల్‌ సెకండ్‌ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టడానికి రెడీ అయిపోయాడు.

- Advertisement -