చార్లెస్ శోభ్‌రాజ్ అంటే పేరు తెలియని వారుండరూ అంత ఫేమస్. అతను సిరియల్ కిల్లర్ కావడమే అందుకు కారణం. గత 19యేళ్లుగా నేపాల్ జైలు జీవితం గడుపుతున్నారు. 2017లో గుండెకు శస్త్ర చికిత్స చేయింకున్న చార్లెస్ అనారోగ్య కారణాల వల్ల బుధవారం నేపాల్ సుప్రీంకోర్టు విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం చార్లెస్ జైలు నుంచి విడుదల కానున్నారు.
1970వ దశకంలో ఆసియా దేశాల్లో అనేకమంది యువ విదేశీయులను ముఖ్యంగా మహిళలను హత్య చేసిన కారణంగా గత 19యేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను హత్యచేసిన కేసులో శోభరాజ్‌ను 2003లో ఖాట్మండు పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో సుప్రీంకోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి శోభరాజ్ జైలుజీవితంను అనుభవిస్తున్నారు. విడుదల అనంతరం ఫ్రాన్స్ కు పంపాలని అతన్ని నేపాల్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు అపగించనున్నారు.
శోభరాజ్ భారత్ లోనూ పలు హత్యలకు పాల్పడ్డాడు. దీంతో 1976 అరెస్టై వివిధ జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు. ఇతన్ని బికినీ కిల్లర్ అని పిలుస్తారు. దానికి కారణం చనిపోయిన మహిళలు బికినీలో ఉండటమే ఇందుకు కారణం. చార్లెస్ శోభ్‌రాజ్ అనేపేరుతో పలు సినిమాల్లో విలన్ పాత్రలు కనిపించనున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టోరీ సినిమాలో శోభ్‌రాజ్ అనే పేరు బాగా ప్రాముఖ్యం చేందింది. ఇతన్ని బికినీ కిల్లర్ అని పిలుస్తారు.
ఇవి కూడా చదవండి…