తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరేక్కడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని గండిలచ్చపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ సావిత్రీభాయిపూలే విగ్రహాలను అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితబంధు పథకం ద్వారా అనేకమంది దళితుల కళ్లలో ఆనందాన్ని సీఎం కేసీఆర్ చూస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు నిరంతరం, నిర్విఘ్నంగా సాగాలంటే కేసీఆర్ లాంటి మనసున్న నాయకుడు ఉంటేనే అమలవుతాయన్నారు. పేదలకు లాభం జరుగుతుంది. ఇంకేవరు వచ్చినా ఈ కార్యక్రమాలన్నీ మాయమైపోయే పరిస్థితి ఏర్పడుతది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా ఈ గ్రామంలో ఈ పథకం ద్వారా ఇద్దరు సోదరులు ఫౌల్ట్రీ ఫాంను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల కుటుంబాలకు దళితబంధు ద్వారా లబ్ది పొందారని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేండ్లు టైం పాస్ చేసిన సీఎంలు చాలా మంది ఉన్నారని తెలిపారు.
దేశంలో ఏఅవార్డు ప్రకటించిన అందులో తెలంగాణకే ఎక్కువగా గ్రామీణ అవార్డులు వస్తున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజానీకం కోసం డంపింగ్ యార్డు, నర్సరీ, ట్రాక్టర్ ట్రాలీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలోనే ఉత్తమ గ్రామపంచాయితీలు ప్రకటించిన సంగతి తెలిపారు. ప్రజల కోసమే మంచి పనులు చేయడం వల్లే అవార్డులు వస్తున్నాయన్నారు.
కంటి వెలుగులాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. గుడ్డితనం వచ్చే దాకా బతికిన వారు చాలా మంది ఉన్నారు. వయసు పెరిగే కొద్ది కంటి, ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం. అవసరమైన వారికి కండ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడంలేదని మండిపడ్డారు. నాయకుడిగా సంపద సృష్టించి పేదలకు పంచాలనే సంకల్పం ఉంటే ఇవన్నీ జరుగుతాయని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ సంపద సృష్టిస్తున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి…