పంజాబ్ సీఎంగా చరణ్ జిత్ సింగ్ ప్రమాణ స్వీకారం..

196
- Advertisement -

పంజాబ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణస్వీకారం చేయించారు. తద్వారా పంజాబ్ సీఎంగా బాధ్యతలను చేపట్టిన తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రపుటల్లోకి ఎక్కారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు.

డిప్యూటీ సీఎంలలో ఒకరు జాట్ సిక్కూ మతానికి చెందిన వ్యక్తి, మరొకరు హిందూ వ్యక్తి ఉన్నారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారానికి ముందు రూప్ నగర్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. .ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ అధినేత సిద్ధూలు హాజరు కాగా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ గైర్హాజరు అయ్యారు.

మరో నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర సీఎంను కాంగ్రెస్ పార్టీ మార్చడం గమనార్హం. గత ఆరు నెలలుగా మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య తీవ్ర వివాదం కొనసాగింది. ఇది పార్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని భావించిన హైకమాండ్ ను అమరీందర్‌ను మార్చేసింది.

- Advertisement -