చరణ్ సెంటిమెంట్ తో నాని?

44
- Advertisement -

టాలీవుడ్ లో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ విషయంలో పక్కా సెంటిమెంట్ ఫాలో అవుతారు మేకర్స్. హీరోలు కూడా రిలీజ్ సెంటిమెంట్ పై ఓ లుక్కేసి లాక్ చేసుకుంటారు. నాని దసరాకి కూడా ఇలాగే ఓ సెంటిమెంట్ ఉంది. అవును నాని దసరా రిలీజ్ తో రామ్ చరణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకు లింకు ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ 2018 లో మార్చ్ 30 న రిలీజైంది. ఇప్పుడు నాని దసరా కూడా అదే డేట్ కి రాబోతుంది.

దసరా ట్రైలర్ చూస్తే మేకింగ్ వైస్ గా రంగస్థలంతో కాస్త పోలిక ఉన్నట్టు కనిపిస్తుంది. రా, రస్టిక్ లుక్ చూస్తే రామ్ చరణ్ సినిమానే గుర్తొస్తుంది. ప్రస్తుత దసరా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనిపిస్తుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంతో గోదావరి ఖని బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘నేను లోకల్’ సూపర్ హిట్టయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబో దసరా కోసం కలిశారు. ఈ నెలలోనే నాని దసరా ప్రమోషన్స్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నాని పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు..

చరణ్ హీరోయిన్ పెళ్లి ఎప్పుడంటే?

బాలకృష్ణ షోలో నిధి

- Advertisement -