మలయాళీ సుందరాంగి అనుపమా పరమేశ్వరన్ కు టాలీవుడ్ టాలీవుడ్‌లో మారుమోగొతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలోని అ..ఆ చిత్రంలో నితిన్ సరసన నటించింది అనుపమ. ఆ తర్వాత ‘నాగచైతన్య’ తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది ఈ మళయాల బ్యూటీ. ఇటీవలే వచ్చిన శతమానం భవతిలో శర్వానంద్ సరసన నటించి మంచి మార్కులు కొట్టెసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈసినిమాలో అనుమమ నటించిన తీరు చాలా అద్భుతంగా ఉందని ఆడియాన్స్ చెప్పుకుంటున్నారు.
రామ్ చరణ్-సుకుమార్ మూవీలోనూ.. నానితో ఓ సినిమా చేసేందుకు ఎంపిక అయినట్లే అయి.. ఆ ప్రాజెక్టులను చేజార్చుకుంది ఈమలయాళీ బ్యూటీ. స్టార్ హీరోయిన్‌గా స్టేటస్ తెచ్చుకుందమనే లోపే సీన్ రివర్స్ అయ్యిపోయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్తసినిమా జైలవకుశలో అనుపమా హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం…ఈ విషయం గురించి అనుపమాను అడగాగ…ప్రస్తుతం లవకుశ సినిమాకు సంబంధించిన స్క్రిప్టులు వింటున్నాను. ఇప్పటి వరకూ ఏదీ కన్ఫాం కాలేదు అంటూ సమాధానం ఇచ్చింది మలయాళీ కుట్టి.
ఎన్టీఆర్‌తో సినిమా ఓకే అయితే ఈ అమ్మడు ఇప్పటికి ఎగిరి గంతైయ్యాలి కానీ ఇంకా స్క్రిప్ట్స్ వినేదగ్గరే ఉందంటే.. ఈ సినిమాలో అమ్మడికి సరైన స్థానం దక్కలేదనే పలువురు అభిప్రాయపడుతున్నారు. శతమానం భవతితో స్టార్ డమ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న అనుపమా పరమేశ్వరన్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచడం వల్లనే పెద్ద సినిమాల్లో అవకాశం దక్కడం లేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.