చరణ్ ఓవర్ పబ్లిసిటీ.. ఎన్టీఆర్ సైలెంట్

34
- Advertisement -

ఇటీవల ఆర్ఆర్ఆర్ ,కు ఆస్కార్ వచ్చిన వేళ ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఛానల్‌ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను హోంమంత్రి అమిత్ షా సత్కారించారు. అనంతరం వీరు ముగ్గురూ ఏకాంతంగా చర్చలు జరిపారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. అమిత్ షాతో భేటీ కావడం రాజకీయా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక చిరంజీవి, రామ్ చరణ్‌ ను కేంద్రం హోం మంత్రి అమిత్ కలిసిన సందర్భంగా భారతీయ చిత్రసీమలోని ఇద్దరు దిగ్గజాలను కలవడం ఆనందంగా ఉందని అమిత్ షా అన్నారు. ఆర్ఆర్ఆర్ తో అధ్బుత విజయానే గాక ఆస్కార్ అవార్డు సాధించిన రామ్ చరణ్‌ను అభినందించిన అమిత్ షా.. తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని కొనియాడారు.

మొత్తానికి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆస్కార్ అవార్డు క్రెడిట్ ను రామ్ చరణ్ తన ఘనతే అన్నట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి పబ్లిసిటీ చేసుకోక పోవడం విశేషం.

ఇవి కూడా చదవండి…

అప్పుడు మైఖేల్.. ఇప్పుడు కబ్జ

పిక్ టాక్ : కాకరేపుతున్న కుర్ర భామ!

సలార్ పై క్రేజీ పుకార్లు ఇవే !

- Advertisement -