చరణ్ డ్రాప్ అవుతాడా ?

37
- Advertisement -

తెలుగులో ఇప్పుడు రీమేక్స్ ట్రెండ్ నడుస్తుంది. షూటింగ్ స్టేజీలో ఉన్న సినిమాల లిస్టులో రీమేక్స్ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రామ్ చరణ్ కూడా ఓ మలయాళం లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఓ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడు. ఆ సినిమానే డ్రైవింగ్ లైసెన్స్. హీరో అభిమాని మధ్య ఇగో క్లాష్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు చరణ్. నిర్మాతగా రైట్స్ తీసుకొని సరైన దర్శకుడు , హీరో కోసం చూస్తున్నాడు. హీరో పాత్రను తనే చేస్తాడో లేదో తెలియదు కానీ ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు.

అయితే ఈ మలయాళం సినిమాను తాజాగా హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేశాడు. సెల్ఫీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హిందీ రీమేక్ సినిమా తేడా కొట్టింది. రిలీజ్ రోజు షాకిచ్చే తక్కువ సంఖ్యలో ఓపెనింగ్స్ దక్కాయి. దీంతో చరణ్ ఇప్పుడు తెలుగులో డ్రైవింగ్ లైసెన్స్ ను తీసే ఆలోచన విరమించుకుంటాడా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి డ్రైవింగ్ లైసెన్స్ లో మంచి కొత్త పాయింట్ ఉంది. సినిమాలో కామన్ అడియన్ అభిమాన పాత్రలో చూసుకుంటాడు. అలాగే హీరోను అభిమాని నిలదీసే సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేశారు. దీన్ని సరిగ్గా తీస్తే సూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ పైగా కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉండాలి. చరణ్ కి హీరో పాత్ర నొప్పక పోవచ్చు. కానీ నిర్మాతగా ఉంది మరో హీరోతో అభిమాన పాత్రను ఎవరైనా కేరెక్టర్ ఆర్టిస్ట్ తో చేయిస్తే పనవుతుంది. కానీ తెలుగులో చేసే మార్పులపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరి చరణ్ సెల్ఫీ దెబ్బ కి ఈ రీమేక్ ను డ్రాప్ చేస్తాడా ? లేదా తను నమ్మిన కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తాడా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

హిందీలో లవ్‌టూడే రీమేక్…

ఉగాదికి ఫస్ట్ లుక్ షురూ !

శబ్దంలో లక్ష్మీమీనన్…

- Advertisement -