చరణ్‌ బర్త్‌ డే.. ‘ఆచార్య’ టీం అదిరిపోయే గిఫ్ట్‌..

202
ramcharan look
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సిద్దగా రామ్ చరణ్‌ లుక్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. తండ్రి తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయి హీరోలుగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సినిమా బిజినెస్ కూడా పూర్తైయినట్టు సమాచారం.

ఈమూవీలో సిద్ధగా చరణ్ లుక్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్టే విడుదల చేసిన లుక్‌ ఎంతో టెర్రిఫిక్‌గా ఉంది. ఈ లుక్‌లో చిరంజీవి,రామ్ చరణ్‌లు చేతిలో గన్నులు పట్టుకొని అన్నలుగా ఉన్నగా లుక్ బాగుంది. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -