చాపెల్‌తో విభేదాలపై గంగూలీ..

161
Chappel-spat: Ganguly makes fresh revelations
- Advertisement -

భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లుగా చెప్పదగినవారిలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒకరు. ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు సాధించిన గంగూలీ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. గంగూలీ నాయకత్వ ప్రతిభకు దేశం యావత్తూ నీరాజనాలు పలికింది. బెంగాల్ టైగర్‌గా కోల్‌కతా ప్రిన్స్, దాదాగా పిలిస్తే పలికే గంగూలీ ఎలెవన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్ పుస్తకంలో గ్రెగ్ చాపెల్ హయాంలో జట్టులో తలెత్తిన విభేదాల గురించి పేర్కొన్నాడు.

తన కెరీర్‌ను సర్వ నాశనం చేయాలని భావించిన చాపెల్‌ను తాను ఇంకా మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నాడు. బోరిజా రాసిన ఈ పుస్తకాన్ని సిమన్ అండ్ షస్టర్ ప్రచురించింది. 500 పేజీలున్న ఈ పుస్తకాన్ని ఐపీఎల్ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఓ రోజు సాయంత్రం గ్రెగ్ నా వద్దకు వచ్చారు. టెస్టు మ్యాచ్‌కు సెలక్ట్ చేసిన జట్టును నాకు చూపించారు. ఆయన చూపించిన జట్టులో కీలకమైన ఆటగాళ్లు లేని విషయాన్ని గుర్తించానని తెలిపారు.

Chappel-spat: Ganguly makes fresh revelations

చాపెల్ సలహాలను నేను చాలాసార్లు తిరస్కరించాను. ఇండియన్ క్రికెట్‌కు మీరేదో చేస్తారని అభిమానులు మీ నుంచి చాలా కోరుకుంటున్నారు. అదే చేయండి అని చాపెల్‌తో స్పష్టంగా చెప్పేశాను అని గంగూలీ తెలిపాడు. అయితే చాపెల్ మాత్రం ‘తన టీం’ను సిద్ధం చేసుకుంటున్నట్టు నాకు అర్థమైంది అని గంగూలీ వివరించాడు. ఓసారి జట్టులో తన పేరు జాబితాలో కనిపించకపోవడంతో తన కెరీర్‌కు చెక్ పెట్టేందుకు చాపెల్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమైందని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -