ఇది ఓ బీరు ప్రియుడి ఆవేదన. గతంలో బ్రాండెడ్ బీరును చూసి చాలా కాలం అయిందని ఏకంగా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు ఓ వ్యక్తి. జగిత్యాల జిల్లాలో నాసిరకం,లోకల్ బీర్లు అమ్ముతున్నారని ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారాడు.
తాజాగా ఇదే జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఏకంగా కింగ్ ఫిషర్ బీరు కోసం తమ ఊరిని వేరే జిల్లాలో కలపాలని సీఎం కేసీఆర్‌కి విజ్ఞప్తి చేశారు. స్ధానికసంస్థల ఎన్నికల ఫలితాల్లో భాగంగా జగిత్యాల రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని ఓ బ్యాలెట్ బ్యాక్స్‌లోంచి ఉత్తరం బయటపడింది.
తమకెంతో ఇష్టమైన బీర్ జగిత్యాల జిల్లాలో లభ్యంకానందున తమ జిల్లాను కరీంనగర్‌లో కలిపేయాలని సీఎం కేసీఆర్‌ని లేఖలో కోరారు. కింగ్‌ఫిషర్(కేఎఫ్) బీర్‌ను అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లెటర్ చదివి జనాలు తెగ నవ్వుకుంటున్నారు.