ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయింది. మద్యాహ్నం 2:35 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన MLV-3 M4 రాకెట్ మూడు దశలను దాటుకొని విజవంతంగా మిషన్ ను కక్షలోకి ప్రవేశ పెట్టింది. దీంతో ఇస్రో సైంటిస్టులపై దేశ వ్యాప్తంగా ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో 2019 లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతంగా కక్షలోకి ప్రవేశ పెట్టినప్పటికి చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ లాండింగ్ అయి ఆ ప్రయోగం విఫలం అయింది. .
దీంతో గత పరభావలను దృష్టిలో పెట్టుకొని చంద్రయాన్ 3 ని అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ప్రస్తుతం కక్షలోకి విజయవంతంగా చేరిన చంద్రయాన్ 3 పేలోడ్ వచ్చే నెల 24 వ తేదీన చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో లాండ్ కానుంది. ఇప్పటివరకు చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసిన దేశాలుగా చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. కానీ ఈ దేశాలేవీ దక్షిణ ధ్రువంలో లాండ్ చేయలేదు. కానీ ఇస్రో మాత్రం చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో లాండ్ చేసే విధంగా చంద్రయాన్ 3 ని రూపొందించిది.
అందుకే చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై లాండ్ అయితే దక్షిణ ధ్రువంలో లాండ్ అయిన మొదటి దేశంగా భారత్ కీర్తి ప్రపంచ దేశాలలో రెపరెపలాడుతోంది. అయితే దక్షిణ ధ్రువంలో లాండ్ కావడం అంతా తేలికైన విషయం కాదు. చంద్రయాన్ 2 కూడా దక్షిణ ధ్రువంలో లాండ్ అయ్యే క్రమంలోనే క్రాష్ అయింది. దీంతో చంద్రయాన్ 3 లాండింగ్ పై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడిపై నీటి జడలను తెలుసుకోవడంతో పాటు మానవ మనుగడకు చంద్రుడి వాతావరణం అనుకూలమా లేదా అనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మన దేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై లాండ్ అవ్వాలని కోరుకుందాం.
Also Read:గ్యాస్ సమస్యలకు ఈ ఆసనంతో చెక్!