Chandrayaan:ఎల్‌ఆర్‌ఏతో అధ్యయనం

15
- Advertisement -

ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లిప్ మోడ్‌లోకి వెళ్లిపోగా తర్వాత ఎల్ఆర్ఏను ఇస్రో యాక్టివ్ చేసింది. ఎల్ఆర్‌ఏ అనేది కక్ష్యలోని అంతరిక్ష నౌక కాంతి నుంచి పరావర్తనం చెందిన కాంతిని ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ఎనిమిది వృత్తాకార 1.27 సెం.మీ వ్యాసం కలిగిన క్యూబ్ రెట్రోరెఫ్లెక్టర్ల మూలలో 5.11cm వ్యాసం, 1.65cm ఎత్తులో ఉన్న అర్ధగోళాకార గోల్డ్ పెయింటెడ్ వేదికపై అమర్చబడి ఉంటుంది.

ప్రతి రెట్రో రిఫ్లెక్టర్లు కొద్దిగా భిన్నమైన దిశలో… గరిష్టంగా +-20 డిగ్రీల కాంతి పరావర్తన కోణంలో ఉంటాయి. ఇది పనిచేయడానికి విద్యుత్ అవసరం లేదు. చంద్రయాన్ మిషన్ పూర్తయ్యే వరకు ఎల్‌ఆర్‌ఏను వినియోగించాలని అనుకోలేదని ఇస్రో సైంటిస్ట్స్‌ వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఏ ఒక కక్ష్యలో ఉన్న అంతరిక్ష నౌక నుంచి ఉపరితలంపై దాని స్థానాన్ని చాలా ఖచ్చితంగా తెలియజేస్తుంది..

ఇది భూమికి ఉన్న దూరం గురించి ఖచ్చితమైన కొలతను అందజేయడానికి అంతరిక్ష నౌక స్థానం చుట్టూ పరిభ్రమించే డేటాతో కలిపి ఉంటుంది.. ఇది భూమికి సంబంధించి చంద్రుని కదలిక వివరాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

Also Read:Bigg Boss 7 Telugu:కంటెస్టెంట్స్ వీరే

- Advertisement -