ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు. 40 రోజుల తర్వాత చంద్రయాన్-3 ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్ దిగుతుంది.
రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36,500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది.
Also Read:ప్చ్.. ‘బేబీ’ రేటింగ్స్ కొనేసిందా?
చందమామపైకి ల్యాండర్‌ను జారవిడిచే చంద్రయాన్ -1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో, చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. తాజాగా లోపాలను సవరించుకొని చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది.
చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ మాత్రమే విజయవంతంగా రోవర్లను దింపాయి. చంద్రయాన్-3 విజయవంతం అయితే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. చంద్రయాన్-3కి రూ.650 కోట్లు ఖర్చు చేసింది.
Also Read:ప్చ్.. ‘బేబీ’ రేటింగ్స్ కొనేసిందా?