రామ్ కు చంద్రముఖి 2 తో వసూళ్ల దెబ్బ?

12
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ” స్కంద ” . బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మాస్ ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మాస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తోంది చిత్రా యూనిట్. ఇక మొదటి ఈ మూవీని వినాయకచవితి కానుకగా రిలీజ్ చేయాలని భావించినప్పటికి ఆ తరువాత సలార్ వాయిదా పడడంతో సెప్టెంబర్ 28కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఆ రోజున కూడా స్కంద మూవీకి గట్టిగానే పోటీ ఉంది. .

18 ఏళ్ల కిందట వచ్చి బ్లాక్ బస్టర్ హర్రర్ మూవీ చంద్రముఖి సినిమాకు సిక్వల్ గా వస్తున్న చంద్రముఖి 2 సెప్టెంబర్ 28ననే విడుదల అవుతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాంతో ఈ సినిమా నుంచి రామ్ స్కంద మూవీకి గట్టిగానే పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప మూవీతో రియలేస్టిక్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నాడు.

Also Read:ప్చ్.. పాపం విజయ్ దేవరకొండ!

ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న మూవీ పెదకాపు పార్ట్ 1. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ తో అందరిని ఆకర్షించింది. దాంతో పెదకాపు మూవీపై కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ సెప్టెంబర్ 28ననే రిలీజ్ కాబోతుంది. ఇక కిరణ్ అబ్బవరం నటిస్తున్న రూల్స్ రంజన్ మూవీ కూడా అదే రోజున రాబోతుంది. దీంతో రామ్ స్కంద మూవీకి గట్టి పోటీ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయా సినిమాలు. మరి ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన రామ్ స్కంద మూవీ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. మరి రామ్ బోయపాటి స్కంద మూవీతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Also Read:స్కంద కి భారీ స్పందన

- Advertisement -