జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు?

192
chandrababu jagan

ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం ప్రమాణస్వీకారాం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ ముస్సిపల్ స్టేడియంలో ఈప్రమాణస్వీకారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జగన్ ప్రమాణస్వీకారానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు జగన్. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కోరారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు వస్తారా? లేదా అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు వస్తారా? రారా అన్న విషయంపై టీడీపీ వర్గాల్లో ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేళ, జగన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సస్పెన్స్ నెలకొంది.