ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతా: చంద్రబాబు

132
ap
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల వివాదం తారాస్ధాయికి చేరుకుంది. వ్యక్తిగత విమర్శలకు ఇరు పక్షాల నేతలు దిగడంతో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త‌న‌పైన‌, త‌న కుటుంబంపైనా స‌భ‌లో వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని, రెండున్న‌రేళ్లుగా ఎన్నోఅవ‌మానాలు భ‌రించాన‌ని, మ‌ళ్లీ స‌భ‌లోకి అడుగుపెడితే అది ముఖ్య‌మంత్రిగానే అని చెప్పి స‌భ‌నుంచి వెళ్లిపోయారు.

అనంతరం త‌న ఛాంబ‌ర్లో అత్య‌వ‌స‌రంగా టీడీఎల్పీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటుగా మండ‌లి నుంచి లోకేష్‌, య‌న‌మ‌ల స‌హా ఇత‌ర ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కరుణానిధి, జయలలిత మధ్య కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.

- Advertisement -