కేసీఆర్‌కు చంద్రబాబు పరామర్శ

76
- Advertisement -

మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు చేరుకున్న చంద్రబాబు…కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు.

కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని..త్వరలోనే మామూలుగా నడుస్తారని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -