- Advertisement -
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తనదైన శైలీలో స్పందించారు. మొన్న చెల్లి షర్మిల వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లిపోయిందని తెలిపారు. చీకటి పాలన వద్దూ చీకటి జీవోలు వద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కూతురు వైఎస్ షర్మిలకు అండగా నిలిచేందుకు రాజీనామా చేశానని వెల్లడించారు.
గతంలోనే వైసీపీ నుండి బయటికొచ్చి తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని స్థాపించిన సంగతి తెలిసిందే.
- Advertisement -