చాప్టర్ క్లోజ్.. బయటకు రావడం కష్టమే ?

34
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అష్టదిగ్బంధంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఒకవైపు స్కిల్ స్కామ్, మరోవైపు క్వాష్ పిటిషన్, ఇంకోవైపు మరికొన్ని కొత్త కేసులు.. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. స్కిల్ స్కామ్ లో భాగంగా రిమాండ్ లో ఉన్న బాబు జైల్లో ఉండక తప్పని పరిస్థితి. ఈ కేసు పై ఏసీబీ కోర్టులో వాదోపవాదనలు జరుగుతూ వైదల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బాబు జైల్లో ఉండి 12 రోజులు అయింది. ఏసీబీ కోర్టులో ఇవాళ తీర్పు వెలువడుతుందని భావించిన మరో రెండు రోజులు రిమాండ్ విధిస్తూ 24 కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఆరోజు కూడా తుది తీర్పు వెలువడుతుందా అంటే చెప్పడం కష్టమే..

చంద్రబాబు తరుపు లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. దేశంలోనే టాప్ లాయర్స్ గా పేరు తెచ్చుకున్న లూథ్రా, సాల్వే వంటి వారు కూడా చంద్రబాబును బయటకు తీసుకురావడంలో చేతులెత్తేస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే క్వాష్ పిటిషన్ కూడా చంద్రబాబును కలవర పెడుతోంది. దానిపై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరుగగా టీడీపీ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇలా అని వైపులా చంద్రబాబు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తుండడంతో చంద్రబాబు జైలు నుంచి అసలు బయటకు వస్తారా లేదా అనే సందేహలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ కష్టమే అనేది కొందరి మాట. ఇక స్కిల్ స్కామ్ ,ఫైబర్ స్కామ్.. ఇలా కేసులన్నీ రుజువైతే చంద్రబాబు రాజకీయ జీవితం క్లోజ్ అయినట్లే అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:డైరెక్టర్‌ పై హీరోయిన్ కి అసంతృప్తి

- Advertisement -