నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?

9
- Advertisement -

నాగబాబుకు మంత్రి పదవి దక్కదన్న చర్చలు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏడాది క్రితం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటామని అధికార పార్టీ స్పష్టంగా ప్రకటించినప్పటికీ, ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. దీనితో నాగబాబు మంత్రి పదవి ఆలస్యంపై వివిధ రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

మొదట్లో మంత్రి పదవి విషయంపై నాగబాబు కూడా మంచి ఉత్సాహం చూపించారు. పలుచోట్ల ఆయనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాతి కాలంలో ఎక్కడా మంత్రి పదవి గురించి ఆయనే ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇది రాజకీయ విశ్లేషకుల సందేహాలకు మరింత బలం చేకూర్చుతోంది.

నాగబాబును కావాలనే పక్కన బెడుతున్నారా? ఆయనను కేబినెట్‌లోకి తీసుకోవడంపై అసహజ పరిస్థితులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల మధ్య చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది నేతలు అంతర్గత రాజకీయ సమీకరణలు, సామాజిక సమతుల్యం, ప్రాంతీయ సమీకరణలు వంటి అంశాలు ఆలస్యానికి కారణమని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం నాయకత్వం నాగబాబును ఇప్పుడే కేబినెట్‌లోకి తీసుకోవాలన్న ఆలోచనలో లేదని అంటున్నారు.

Also Read:Karnataka:డీకే..ట్వీట్ వైరల్

ఇదిలా ఉండగా, నాగబాబు మాత్రం ఈ అంశంపై మౌనం పాటించడం కొనసాగిస్తున్నారు. పార్టీ హామీపై ఎటువంటి అసంతృప్తిని బయటపెట్టకపోవడం, ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు అందరి చూపు నాయకత్వ నిర్ణయంపైనే నిలిచింది.

- Advertisement -