ఓటుతో కూటమికి బుద్దిచెప్పండి:హరీష్‌

234
Harish Rao
- Advertisement -

మన నీళ్లు మనకు దక్కాలంటే కేసీఆరే మళ్లీ సీఎం కావాలన్నారు మంత్రి హరీష్ రావు.ఇబ్రహీంపట్నం ప్రమీద గార్డెన్స్‌లో రైతు సమ్మేళనంలో మాట్లాడిన హరీష్ కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు 19 ప్రశ్నలతో బహిరంగలేఖ రాస్తే ఏపీ ప్రభుత్వం స్పందించిందన్నారు. పాలమూరు రంగారెడ్డి,దిండి ఎత్తిపోథల పథకాన్ని అడ్డుకొని తీరుతామని తెలిపారన్నారు.చంద్రబాబు ఉన్న కూటమికి ఓటేస్తే తెలంగాణను నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. పాలమూరు-దిండి ఎత్తిపోథల పథకాన్ని వెంటనే ఆపేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖరాశారని గుర్తుచేశారు. తెలంగాణలో ఓట్లు అడిగే నైతికహక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఓటుతో మహాకూటమికి బుద్దిచెప్పాలని ప్రజలను కోరారు హరీష్‌.

కాంగ్రెస్,టీడీపీలు గత ఎన్నికల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకాన్ని పూర్తిచేస్తామని చెప్పారని కానీ ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దిండి ప్రాజెక్టుకు 11 సంవత్సరాల క్రితమే డీపీఆర్ వచ్చిందని కానీ ఇక్కడి ప్రజల మీద ప్రేమ లేకనే నిధులు కేటాయించలేదన్నారు.

ఢిల్లీలో అపెక్స్ కమిటీ ముందు కూడా చంద్రబాబు అబద్దాలు చెబితే కేసీఆర్ వాటిని తిప్పికొట్టారని చెప్పారు.2014కు ముందు ఒకమాట తర్వాత మరోమాట మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే అన్నారు. తెలంగాణలో ఒకమాట ఆంధ్రాలో ఒకమాట రెండు నాల్కల దొరణి చంద్రబాబుకు అలవాటే అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిందే స్వీయ అస్తిత్వం కోసమని కానీ ఇవాళ పరిస్థితి చూస్తే కాంగ్రెస్..చంద్రబాబు ముందు మొకరిల్లే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో కాదు అమరావతిలో ఫైనల్ అవుతున్నాయని చెప్పారు. తెలంగాణ టీడీపీ నాయకులు పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టు కట్టాలా వద్దా చంద్రబాబుతో చెప్పించాలని సవాల్ విసిరారు.

2007లోనే కష్టపడి డీపీఆర్ తెప్పించానని జానారెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు హరీష్. దిండి ప్రాజెక్టును అడ్డుకుంటున్న చంద్రబాబుతో ఏ విధంగా పొత్తుపెట్టుకుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరి స్పష్టంచేశాకే ఓట్లు అడిగేందుకు రావాలని డిమాండ్ చేశారు.

సంక్షేమం,అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. వెయ్యి రూపాయల ఫించన్,రైతులకు నిరంతర విద్యుత్,ఎరువులు,విత్తనాలు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాంగ్రెస్ వస్తే విద్యుత్ సంక్షోభం,పరిపాలన అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఇబ్రహీంపట్నం మడి తడవాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.

- Advertisement -