150కోట్ల క్ల‌బ్ లో ‘స‌ర్కార్’..

306
sarkar crosed 150cr
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏఆర్. మురుగ‌దాస్ ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూవీ స‌ర్కార్. విడుద‌లైన మొద‌టి రోజు నుంచే ఈ మూవీ భారీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. విజ‌య్ కి జంట‌గా కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. విజ‌య్ మురుగ‌దాస్ ల‌కు హ్యాట్రిక్ హిట్ గా చెప్పుకోవ‌చ్చు. మొద‌టి నుంచి ఈచిత్రం కొన్ని వివాదాలు ఎదుర్కొంటునే ఉంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది.

sarkar

విడుద‌లైన తొలి రెండు రోజుల్లోనే 100కోట్లు వ‌సూలు చేసింది. తాజ‌గా ఈసినిమా మ‌రో రికార్డు సృష్టించింది. విడుద‌లైన నాలుగురోజుల్లో 150కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. విజ‌య్ న‌టించిన సినిమాల్లో 150కోట్ల క్ల‌బ్ లోకి రావడం ఇది మూడ‌వసారి. గ‌తంలో విజ‌య్ న‌టించిన ‘తెరి’ .. మెర్సల్’ సినిమాలు ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి. వివాదాల మ‌ధ్య విడుద‌లైన ఈసినిమా ఇంత‌గా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంపై ఆనందం చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -