ఇన్సూరెన్స్ కంపెనీలతో సీఎం చంద్రబాబు

10
- Advertisement -

ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు.. వరదల్లో భారీగా టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలు మునిగిన సంగతి తెలిసిందే. వాహనాలు రిపేర్లకే వేలల్లో ఖర్చు అవుతుందని అంచనా వేయగా..వరద బాధితులకు భారం తగ్గేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒక్కో ఇంటికి 25కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పు, కిలో చక్కెర, 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల ఉల్లిపాయలు ఇస్తామన్నారు. వరద ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని చెప్పారు. రేపు కూడా పాలు, నీళ్లు, ఆహారం అందజేస్తామన్నారు. సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని వివరించారు.

ఏపీలో వరదల కారణంగా ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా ఎన్టీఆర్‌ జిల్లాలో 23 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందగా వరదల వల్ల 212 పశువులు, 60 వేల కోళ్లు మృతి చెందాయి.

Also Read:వరద బాధితులకు అండగా నిలబడండి: రేవంత్

- Advertisement -