ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పరిపాలనలో వేగం పెంచేందుకు మంత్రుల పనితీరుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ప్రతి మంత్రి ఎంత సమయం తీసుకుంటున్నారో విశ్లేషించి వారికి రేటింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం వెల్లడించారు.
ఈ సమీక్షలో ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన మంత్రిగా అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వేగంగా ఫైళ్లను క్లియర్ చేస్తున్న మంత్రుల్లో ఒకరిగా నిలిచారని సీఎం తెలిపారు.
ఇక ఫైళ్ల క్లియరెన్స్‌లో చివరి స్థానంలో మంత్రి వంగలపూడి అనిత ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి శాఖలో ఫైళ్లు ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సీఎం సూచించారు. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు ఆలస్యం కాకుండా అధికారులు, మంత్రులు త్వరితగతిన స్పందించాలని ఆయన ఆదేశించారు.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!
రాష్ట్ర అభివృద్ధి కోసం పరిపాలన వేగంగా సాగాలని, అందుకు ఫైళ్ల క్లియరెన్స్ కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో కూడా మంత్రుల పనితీరును ఇలాగే సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

