మొంథా తుపానులో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం జరిగింది. మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమెంటోలను అందించారు ఏపీ సీఎం చంద్రబాబు.
తుపాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందికి సీఎం ప్రత్యేక అభినందనలు చెప్పారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తుపాన్ డేటాను విశ్లేషిస్తున్నాం…5 పాయింట్ల అజెండాతో తుపాన్ ను ఎదుర్కొన్నాం… అధికారులు అద్భుతంగా పనిచేశారు అన్నారు.
మరోవైపు ఏపీలో ఖరీఫ్ సీజన్ కరువు మండలాలను ప్రకటించింది ప్రభుత్వం. అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 కరువు మండలాలు ప్రకటించగా అన్నమయ్య జిల్లాలో 9 కరువు మండలాల ప్రకటించారు. సత్యసాయి జిల్లాలో 25 కరువు మండలాలు, ప్రకాశం జిల్లాలో 3 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి.
Also Read:BB9:కెప్టెన్‌గా దివ్య

