కాశీబుగ్గ తొక్కిసలాటపై లోకేష్

8
- Advertisement -

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు మంత్రి నారా లోకేష్. ఈ ఘటనలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు.

గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది.. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడాను.. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించాను అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరుగగా నలుగురు భక్తులు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలిరాగా రెయిలింగ్ ఊడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు భక్తులు.

Also Read:యుకేకు చంద్రబాబు దంపతులు

- Advertisement -