సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అకాల మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వీరితోపాటు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుధవారం నాటి కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే మంత్రులు కేఈ, కళా వెంకట్రావు, పరిటాల సునీత, నక్కా ఆనందబాబు, టీడీపీ నేతలు రఘురామకృష్ణంరాజు, ఏవీ రమణ, ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తదితరులు హరికృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి ఏపీ-28 బీడ్ల్యూ- 2323 అనే నెంబర్ గల కారులో వెళుతుండగా అన్నెపర్తి దగ్గర డివైడర్‌ను ఢీకొన్న సంఘటనలో హరికృష్ణ మృతి చెందారు.